ఫిబ్రవరి 3న జాయింట్ సెషన్…

71
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తొలి ప్రసంగంపై నెలకొన్న ప్రతిష్టంభన ముగిసిపోయింది. ఫిబ్రవరి 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.10గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. అ తదుపరి ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సమాచారంను ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సారి తెలంగాణ వార్షిక బడ్జెట్‌ రూ.3లక్షల కోట్లకు పెరగనున్నట్టు సమాచారం. మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల నుంచి జరిగనుంది. అయితే ఈ యేడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చుతారా లేదా కొత్తగా పథకాలను ప్రారంభిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

రాహుల్‌ నిర్వాకం..ఫ్లాగ్‌ కోడ్‌ ఉల్లంఘన

ఈ దేశానికి దిక్సూచి…గాంధీ

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం..

- Advertisement -