- Advertisement -
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తుండగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలు,విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా తాజాగా అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వర్షాలు, వరదల సమయంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజక వర్గాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని.. సహాయక చర్యల్లో పాల్గొనాలని బులిటెన్‌లో పేర్కొన్నారు.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు శాసనసభ, శాసన మండలి బిజినెస్ జరగదు. అక్టోబర్ 1వ తేదీ నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
- Advertisement -