23 నుంచి శాస‌న‌స‌భ స‌మావేశాలు..

16
- Advertisement -

ఈ నెల 23 నుంచి శాస‌న‌స‌భ‌, 24 నుంచి శాస‌న‌మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 23న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. శాస‌న‌స‌భ స‌మావేశాల నేప‌థ్యంలో జులై 25 లేదా 26వ తేదీల్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం.

ప‌ది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప‌ది రోజుల్లో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిరుద్యోగ సమస్య, పార్టీ ఫిరాయింపులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Also Read:5 నిమిషాలు ఇలా చేయండి..బరువు తగ్గండి!

- Advertisement -