- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి 28వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ మేరకు బీఏసీ కమిటి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు హాజరయ్యారు.
12,13,20,27 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించగా గంటపాటు ప్రశ్నోత్తరాల సమయం ఉండనుంది. అరగంటపాటు జీరో అవర్…ప్రశ్నోత్తరాల సమయంలో 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతించనున్నారు.
కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కొత్త రెవెన్యూచట్టం, పరిపాలన సంస్కరణలపై చర్చించనున్నారు.
- Advertisement -