ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ మొదట గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించారు. ముందుగా సీఎం కేసీఆర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మాద్ ఖాన్. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 23మంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇద్దరు ఎంపీలు , ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇవాళ జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మొత్తం 5గురు ఎమ్మెల్యేలు గైహజరయ్యారు. మాధవరం కృష్ణారావు, అసదుద్దీన్ ఓవైసీ, సండ్ర వెంకట వీరయ్య, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్ లు హాజరుకాలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్. వరుసగా 8సార్లు అసెంబ్లీకీ ఎన్నికై సభలోనే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కేసీఆర్ తర్వాత ఎక్కవ సార్లు గెలిచిన వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రెబల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్ లు సీనియర్లుగా ఉన్నారు. ఇక సభలో అతి చిన్న వయస్సుకలిగిన ఎమ్మెల్యేగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఉన్నారు.