నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

210
trs campaign
- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనుండగా 13 నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ఎండ్ కానుంది.

బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, సినిమాలు నిషేధమని ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఛానెళ్లలో ఒపీనియన్‌ సర్వేలు, ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను బ్యాన్ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష,జరిమానా విధిస్తామన్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర జిల్లాల వ్యక్తులు, రాజకీయ నేతలంతా ప్రచార గడువు ముగిసిన వెంటనే తమతమ ప్రాం తాలకు వెళ్లిపోవాలని, స్థానికులు తప్ప కొత్తవారు జిల్లాల్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది.

సినిమా థియేటర్లు, టీవీలు ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారంచేయడాన్ని నేరంగా పరిగణిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి సర్వేలను ప్రసారం చేయరాదని పేర్కొన్న ఎన్నికల కమిషన్.. బల్క్ ఎస్సెమ్మెస్‌లనూ నిషేధించింది.

- Advertisement -