కమల్ సంచలన నిర్ణయం…

225
Kamal Hassan indian 2
- Advertisement -

విలక్షణ నటుడు కమల్ హాసన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. భారతీయుడు 2 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు.రెండు దశాబ్ధాల క్రితం కమలహాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ పెను సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ ఇండియన్‌ 2 ప్రేక్షకుల ముందుకురానుంది.

కమల్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మూడు భాషల్లో దిల్ రాజు నిర్మించనున్నారు. శంకర్‌ ‘2.ఓ’కు సంబంధించిన పనులను పూర్తి చేయగా…. ‘ఇండియన్‌2’కు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సంచలన నిర్ణయం ప్రకటించారు కమల్. ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించిన ఆయన వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత సినిమాల నుంచి తప్పుకుని తన పూర్తిస్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నట్టు తెలిపారు.

- Advertisement -