- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు. ఇక పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్నిఏర్పాట్లను చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా ఈసీ పర్యవేక్షించనుంది.
ఈసారి పోలింగ్ శాతం పెంచేలా ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది. దీంతో పాటు సెలబ్రెటీలు సైతం అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read:నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?
- Advertisement -