అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్ మాట్లాడుతున్నారు. రాజ్ భవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, టీఎస్‌ఎల్‌ఎస్ కార్యదర్శి డాక్టర్ రాజాసదారాం, జాయింట్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ స్వాగతం పలికారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బడ్జెట్ ను ఈ నెల 13న సభలో ప్రవేశపెట్టనున్నారు. 15 నుంచి 18 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఏసీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.