తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు వాయిదా..

163
Budget Session
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ఇవాళ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగించారు. ప్ర‌భుత్వ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తిని గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత స‌భ‌ను మంగళవారానికి వాయిదా వేశారు.

మంగళవారం స‌భ‌లో సంతాప తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానం, చ‌ర్చ‌ను 17న చేప‌ట్ట‌నున్నారు.. 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హ‌రీష్‌ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల‌ 19వ తేదీన సెలవు ఉంటుంది.ఆ త‌దుప‌రి రోజు నుంచి బడ్జెట్‌పై చర్చలు ప్రారంభ‌మ‌వుతాయి.

- Advertisement -