స‌మంత ‘శాకుంతలం’ ప్రారంభం..

320
Samantha Shaakuntalam
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు లాఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దీనికి సంబంధించిన ఫొటోల‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.‌ పూజా కార్య‌క్ర‌మాల్లో వారంతా పాల్గొన్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం త‌దుప‌రి వారం నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపింది.

ప్యాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న‌ శాకుంత‌లం సినిమాలో స‌మంత ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, దుష్యంతుడి పాత్ర‌లో దేవ్ మోహన్ న‌టిస్తున్నాడని ఆ సినీ బృందం స్ప‌ష్టం చేసింది. కెరీర్‌లో సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

- Advertisement -