సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

546
Aryavaisha
- Advertisement -

తెలంగాణలో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఆర్యవైశ్య మహాసభకు ప్రభుత్వం 5 ఏకరాలు భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా హైదరాబాద్ లోని కొత్తపేటలో శ్రీ వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్యవైశ్య సంఘం నేతలు.

ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు పాల్గోన్నారు. ఆర్యవైశ్యులకు ఉప్పల్ భగాయత్ లో 5 ఏకరాల భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు బుణపడి ఉంటామన్నారు. రాష్ట్ర అభివృద్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -