మహా అప్‌డేట్స్‌..బీజేపీతో ఎన్సీపీ పొత్తు.!

522
modi pawar
- Advertisement -

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం,రాష్ట్రపాతి పాలన నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇప్పటివరకు శివసేనతో కలిసి ఎన్సీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని వార్తలు వెలువడగా తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తే రాష్ట్రపతిగా శరద్ పవార్ కు చాన్స్ ఇస్తామన్న భారీ ఆఫర్ ను బీజేపీ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే రైతుల సమస్యల గురించి ప్రధానితో మాట్లాడేందుకు మాత్రమే పవార్ ఢిల్లీకి వెళ్లారని ఎన్సీపీ చెబుతోంది. ఇక ఇవాళ సాయంత్రం సోనియా గాంధీని కలవనున్నారు శరద్ పవార్. అనంతరం బీజేపీకి మద్దతిచ్చే విషయంపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

Nationalist Congress Party (NCP) leader Sharad Pawar met Prime Minister Narendra Modi over the farm crisis in Maharashtra

- Advertisement -