తొలిదశ తెలంగాణ ఉద్యమ రూపశిల్పి’మడత’కన్నుమూత

234
madatha
- Advertisement -

లిదశ తెలంగాణ ఉద్యమ రూపశిల్పి,గొప్ప సామాజిక కార్యకర్త మడత నారాయణ దాస్ (81)హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు. మడత నారాయణ దాస్ వరంగల్ అర్బన్ జిల్లాలోని ఒక కుగ్రామమైన రాంపూర్ లో కడుపేద చేనేత కుటుంబానికిచెందిన శ్రీమతి కనకమ్మ-లక్ష్మినర్సయ్య పుణ్యదంపతులకు 1942 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. ప్రాధమిక విద్య స్వగ్రామంలో,మాధ్యమిక విద్య ధర్మసాగర్లో,హై స్కూల్ విద్య మల్టీపర్పస్ ఉన్నత పాఠశాల హన్మకొండలో అభ్యసించారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో 1963 వరకు బిఏ చదివారు.1964లో ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ (హిందీ)పట్టభద్రులయ్యారు.

ముఖ్యంగా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి సాధించారు.ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం,1970 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అనేక విద్యార్థి ఉద్యమాలకు మడత నారాయణ దాస్ నాయకత్వం వహించారు.అటానమస్ ఉద్యమం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 72 కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు. మడత నారాయణ దాస్ 1969లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి మాజీ కేంద్ర మంత్రి కీ॥శే॥డాక్టర్ మల్లిఖార్జున్ గౌడ్ అధ్యక్షుడిగా గెలిపించారు.ప్రత్యేక రాష్ట్రమే అన్ని సమస్యలకు పరిస్కారమని భావించి తెలంగాణ యాక్షన్ కమిటీ నియమించి సారధ్యం వహించారు.ఈ ఉద్యమం అనతి కాలంలోనే ఉవ్వెత్తునలేచి గ్రామాలు,పట్టణాలకు విస్తరించి ప్రజా ఉద్యమంగా మారింది.ఇలాంటి ఉద్యామాలే కాకుండా జాతీయ,రాజకీయ,సామాజిక ఉద్యమాలలో కీలక భూమిక పోషించారు.నిస్వార్థ సేవ,త్యాగనిరతి వల్ల చాలా మంది ముఖ్యమంత్రుల మన్ననలు పొందారు.నారాయణ దాస్ నాయకత్వంలో అనేక మంది విద్యార్థులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడ్డారు.మడత నారాయణ దాస్ సిపిఐ నాయకుడు మడత కాళీదాస్ సోదరుడు.ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా జీవిస్తూ ఎన్నో సామాజిక,సాంఘీక కార్యక్రమాలు నిర్వహించారు.

వన్నాల సంతాపం!

తొలిదశ తెలంగాణ ఉద్యమ రూపకర్త,గొప్ప సామాజిక కార్యకర్త మడత నారాయణ దాస్ మృతి పట్ల వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు,ఒబిసీ మోర్చా కర్నాటక రాష్ట్ర ఇంచార్జీ,మడత నారాయణ దాస్ పౌండేషన్ అధ్యక్షులు వన్నాల శ్రీరాములు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడత నారాయణ దాస్ శనివారం కన్నుమూశారు.ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో 1964లో ఎంఏ చదువుతున్న రోజులలో జరిగిన మ్యాక్ పార్లమెంట్ కార్యక్రమంలో అటల్ బీహారీ వాజ్ పేయ్ లాగా నారాయణ దాస్ ప్రసంగిస్తే యూనివర్సిటీ ఉర్రూతలూగిందని,తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని వన్నాల తెలిపారు.తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మడత నారాయణ దాస్ కర్త,కర్మ,క్రియగా నిలిచారని వన్నాల కొనియాడారు.

నిస్వార్థ గొప్ప దేశభక్తుడని,జాతీయ భావాలు కలిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారని వన్నాల శ్రీరాములు తెలిపారు.నారాయణ దాస్ ఉద్యమ పటిమ నేటితరం విద్యార్థులకు, యువతకు స్పూర్తిదాయకమని వన్నాల అన్నారు.ఎమర్జన్సీలో 13నెలల17రోజులు జైలు జీవితం గడిపి మురార్జిదేశాయ్ ప్రధాన మంత్రి అయిన తర్వాత విడుదలైన ఏకైక వ్యక్తి మడత నారాయణ దాస్ అని వన్నాల అన్నారు.దాస్ మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని వన్నాల శ్రీరాములు,నారాయణ దాస్ పౌండేషన్ కార్యదర్శి జంగిలి రామకృష్ణా రావులు బాధాతప్త హృదయంతో సంతాపం,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -