- Advertisement -
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడుతూ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఇది నిజంగా చల్లటి కబురే.
ఆదివారం నగరంలో చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది.
Also Read:వైరల్ వీడియో…రిలీజ్ చేసిన ఆర్మీ
- Advertisement -

