ఆసియా కప్‌కు టీమిండియా దూరం..!

11
- Advertisement -

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో త్వరలో జరగబోయే ఆసియా కప్‌ను బహిష్కరించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు రాగా దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం సమాచారం.

ఇండియా నుంచి ఎక్కువ స్పాన్సర్లు ఆసియా కప్‌కు వస్తున్నారు. దేశంలో ప్రస్తుతం పాకిస్తాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బీసీసీఐకి టోర్నీని ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారింది. 2024లో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది టోర్నీ జరగకపోతే ఆ ఒప్పందాన్ని తిరిగి పునఃసమీక్షించాల్సి ఉంటుంది.

2023 ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. ఇందులో భాగంగా కొంత భాగం శ్రీలంకలో జరిగింది. ఫైనల్లో భారత్ శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకోగా, పాకిస్తాన్ ఫైనల్‌కు కూడా అర్హత పొందలేకపోయింది.

Also Read:Joe Biden: జో బైడెన్‌కు క్యాన్సర్​

- Advertisement -