2020-21 తెలంగాణ బడ్జెట్ ముఖ్యంశాలు

350
TSBUDGET2020-21
- Advertisement -

2020-21 సంవత్సరానికిగాను శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు.

బడ్జెట్ ముఖ్యంశాలు..

*మన రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ. వ్యవసాయ రంగం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది. 2019-2020ఫిబ్రవరి నాటికి రావాల్సిన నిధుల వాటా 6.3శాతానికి తగ్గింది. రైతుబంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఈబడ్జెట్ లో రైతు బంధు పథకానికి రూ.14వేల కోట్లు.

*రైతు భీమా కోసం రూ. 1,150కోట్లు. రైతు ఏ కారణం వల్ల మరణించినా రూ.5లక్షల ప్రమాద భీమా.

* రూ.25వేల లోపు రుణాలు ఉన్న రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ

*రైతు రుణమాఫీకోసం బడ్జెట్ లో రూ. 6,225కోట్లు
*విత్తనాల సబ్సిడికి రూ.142కోట్లు
*మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ కోసం రూ. 1000కోట్లు
* డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ. 1819కోట్లు
*మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 600కోట్లు
*రైతు సమన్వయ సమితి పేరు రైతు బంధు సమితిగా మార్పు
*రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350కోట్లు
*పాడిరైతుల ప్రోత్సాహకం కోసం రూ. 100కోట్లు
*పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20లక్షల ఎకరాలకు సాగునీరు

*సీతారామ ప్రాజెక్టుతో 10లక్షల ఎకరాలకు సాగునీరు
* సాగునీటి పారుదల రంగానికి రూ.11.054 కోట్లు
*మిషన్ కాకతీయతో 15లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ
*మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు
*40వేల కోట్లతో సంక్షేమ పథకాల అమలు
*సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్నాం.
*57ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పింఛన్
*ఆసరా పెన్షన్ల కోసం రూ. 11,758కోట్లు.
*ఎస్సీలకు 268గురుకులాలు.
*ఎస్టీలకు 169గురుకులాలు.
*ఎస్సీ, ఎస్టీ విద్యార్దుల ఓవర్సీస్ స్కాలర్ షిప్ కోసం రూ. 20లక్షల ఆర్ధికసాయం.
*ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకోసం 101యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
*ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, మైక్రో ఇరిగేషన్ కోసం సబ్బిడీ రెట్టింపు
*ఎస్సీ,, ఎస్టీలకు మార్కెట్ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్
*ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.16,534కోట్లు
*ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధికి రూ. 9,771కోట్లు
*వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 71 మైనారిటీ జూనియర్ కాలేజీలు
*టీఎస్ ప్రైమ్ పేరుతో మైనారిటీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రొత్సాహం
* మైనారిటీ విద్యార్దులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్
* మైనారిటీల అభివృద్ది కోసం రూ. 1,518కోట్లు
*ఇప్పటివరకు 76లక్షల92వేల 678గొర్రెల పంపిణి జరిగింది.

*మరో 70లక్షల 88వేల గొర్రె పిల్లల ఉత్పత్తి చేస్తున్నాం.

*గొర్రెల ద్వారా రూ. 3,189కోట్ల సంపద సృష్టి
*ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6లక్షల ఎక్స్ గ్రేషియా.
* హరితహారంలో భాగంగా ఈత, తాటి వనాల పెంపకం
* గీత కార్మికుల ఆదాయం పెంచడానికి ప్రత్యేక పాలసీ
*శీతల పానీయంగా నీరా అమ్మకం
*గీత కార్మికుల చెట్టుపన్ను, పాత బాకీల రద్దు.
*మత్స్య పరిశ్రమాభివృద్దికి ప్రత్యేక చర్యలు.
*చెరువులు, జలాశయాల ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ది.
*ఈ ఆర్ధిక సంవత్సరం 90చేప పిల్లలు, 10కోట్ల రొయ్య పిల్లల పంపిణి
*రూ.20కోట్లతో 28చేప పిల్లల కేంద్రాల ఆధునీకరణ
*పశుపోషణ, మత్స్య శాఖకు రూ.1,586కోట్లు
*కళ్యాణ లక్ష్మీ పథకం కోసం రూ. 1,350కోట్లు
*ఎంబీసీ కార్పొరేషన్ కోసం రూ. 500కోట్లు.
*బీసీల సంక్షేమం కోసం రూ. 4వేల356కోట్లు.
*మహిళా స్వయం సహాకారం సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1200కోట్లు.
*జాతీయ ఉపాధి హామి పథకం పనుల్లో వస్తు సామాగ్రి కోసం ప్రతినెల రూ. 65కోట్లు.
*గ్రామ పంచాయితీల్లో పనిచేసే సిబ్బందికి రూ.2లక్షల జీవిత భీమా.

*పంచాయితీ రాజ్ గ్రామీనాభివృద్ది కోసంరూ. 23,005కోట్లు.

*పట్టణాలు, నగరాల అభివృద్దికి ప్రతీనెల రూ.148కోట్లు.

*మున్సిపల్ శాఖకు రూ. 14,809కోట్లు.
*పాఠశాల విద్యాశాఖకు రూ.10వేల421కోట్లు.
*ఉన్నత విద్యాశాఖకు రూ.1,723కోట్లు.
* హైదరాబాద్ నగర అభివృద్ది, మూసీ ప్రక్షాళన కోసంరూ. 10వేల కోట్లు.
* త్వరలో పాతబస్తీలో 5కి.మీ మెట్రో రైలు మార్గం పూర్తి.
*రాయదుర్గం నుంచి శంషాబాద్, బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ వరకు మెట్రో ప్రణాళిక
*ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.2,650కోట్లు.
*పాఠశాల విద్యాశాఖకు రూ.10,421కోట్లు.
*ఉన్నత విద్యాశాఖకు రూ.1,723కోట్లు.
*ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమానికి రూ.100కోట్లు.
*సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం.
* హైదరాబాద్ లో బస్తీ దవాఖానాల సంఖ్య 350కి పెంపు.* వైద్య రంగానికి రూ. 6,186కోట్లు.
*కోటి 54లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు.
*తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు శ్రీకారం.
*తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ .

*తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1896యూనిట్లు.
*ఐటీ దిగ్గజ కంపెనీలకు కేంద్రస్ధానంగా హైదరాబాద్.
* దేశం దృష్టిని ఆకర్షించిన టీ-హబ్.
*విద్యుత్ శాఖకు రూ.10,416కోట్లు.
*టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2లక్షల 4వేల కోట్ల పెట్టుబడులు.
*ఇండస్ట్రియల్ ఇంటెన్సివ్ కోసం 1,500కోట్లు.
*పారిశ్రామిక రంగ అభివృద్ది కోసం రూ.1,998కోట్లు.
*ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు 60ఏళ్లకు పెంపు.
*ఆర్టీసికి రూ.1000కోట్లు.
*వివిధ దశల్లో రెండు లక్షల 72వేల 763డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.
*గృహ నిర్మాణం కోసం రూ. 11,917కోట్లు.
*పర్యావరణ, అటవీశాఖకు రూ. 791కోట్లు.
*దేవాలయాల అభివృద్దికి రూ.500కోట్లు.
*రహదారుల నిర్మాణం, నిర్వహణకు రూ. 750కోట్లు.
*రవాణ, రోడ్లు భవనాల శాఖకు రూ. 3,494కోట్లు.
*పోలీస్ శాఖకు రూ. 5,852కోట్లు.

- Advertisement -