మళ్లీ తండ్రైన తేజస్వి

4
- Advertisement -

బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మళ్లీ తండ్రయ్యాడు. ఈ శుభవార్తను ఆయనే స్వయంగా తెలిపాడు. తన భార్య రాజశ్రీ యాదవ్‌కు కుమారుడు జన్మించాడని ప్రకటించారు. ఇది వీరిద్దరికీ రెండవ సంతానం.

శుభోదయం! చివరికి నిరీక్షణకు ముగింపు! మా చిన్న కొడుకు ఆగమనాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని జై హనుమాన్ అని ట్వీట్ చేశాడు తేజస్వి. ఈ సంతోషం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరింత శుభాన్నందిస్తోంది. తేజస్వి అక్క, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి తొలి శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read:పాక్‌కు సరైన జవాబిస్తాం:మోదీ

- Advertisement -