Bihar: విద్వేష రాజకీయాలు సరికావు

2
- Advertisement -

విద్వేష రాజకీయాలు ఎంతో కాలం మనలేవని, జనం మధ్య విద్వేషాలను ప్రేరేపించే వారికి జనం ఫుల్‌ స్టాప్‌ పెడుతారని అన్నారు ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్.దేశంలో జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

బీహార్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న నాలుగు స్థానాలను తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

జార్ఖండ్‌ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే బీహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:Salman: సల్మాన్‌కు మళ్లీ బెదిరింపు

- Advertisement -