కాంట్రాక్ట్ ఉద్యోగులకు తేజస్వి వరాల జల్లు

9
- Advertisement -

బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరో కీలక ఎన్నికల హామీ ఇచ్చారు. మహాఘట్‌ బంధన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ‘జీవికా సిఎం దిదీలకు’ నెలకు రూ.30,000 జీతంతో పాటు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, “జీవికా సిఎం (కమ్యూనిటీ మొబిలైజర్‌) దిదీలను శాశ్వత ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించి, వారి జీతాలను పెంచుతాం. ఇది చాలా కాలంగా ప్రజల డిమాండ్‌గానే ఉంది” అని అన్నారు. అదనంగా, రాష్ట్రంలోని అన్ని కాంట్రాక్టు ఉద్యోగులను కూడా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని చెప్పారు.

“మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రభుత్వంలో జీవికా దిదీలకు అన్యాయం జరిగింది… మేము నిర్ణయించుకున్నాం — వారి జీతాన్ని నెలకు రూ.30,000కు పెంచుతాం. ఇది సాధారణ ప్రకటన కాదు, ఇది వారి హక్కు,” అని ఆయన పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

()జీవికా దిదీలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారు.

()రెండు సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తారు.

()జీవికా గ్రూప్ మహిళలకు ప్రభుత్వ పనుల్లో పాల్గొనడానికి నెలకు రూ.2,000 భత్యం ఇస్తారు.

()రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తారు.

()రాష్ట్రంలోని అన్ని కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతారు.

Also Read:పుతిన్‌తో చర్చలపై ట్రంప్

- Advertisement -