లాలన్ సింగ్ వ్యాఖ్యలపై తేజస్వీ

8
- Advertisement -

లాలన్ సింగ్ అంటున్నారు, ఎవరైనా పేదలు, అతి వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఓటు వేయడానికి బయటకు రావొద్దని. ఇది ఏంటి, బాప్ కా రాజ్ హై? లాలన్ సింగ్ కే బాప్ కా రాజ్ హై? ప్రజాస్వామ్యం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం అని మండిపడ్డారు తేజస్వీయాదవ్. సమస్తీపూర్ జిల్లా మోహియుద్దీన్ నగర్లో జరిగిన సభలో మాట్లాడిన తేజస్వి.. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును ఇచ్చాయి…. ప్రధానమంత్రి అయినా, కూలీ అయినా — అందరికీ ఒకే హక్కు. ఇలాంటి నియంతలను పాఠం నేర్పించాలి. ఎన్నికల సంఘం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.

దళితులు, పేదలు, అతి వెనుకబడిన వర్గాల వారు ఓటు వేయకుండా అడ్డుకోవాలని బహిరంగంగా చెప్పడం ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించడం అని పేర్కొన్నారు. బిహార్‌లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని ఆరోపించి, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన మాట్లాడుతూ “కొంతమందిని పోలింగ్ రోజు ఇళ్లలోనే బంధించాలి…. వారు బయటకు రాకూడదు. అవసరమైతే వారిని పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి, ఓటు వేసిన తర్వాత తిరిగి ఇంటికి పంపం అని మగాహీ భాషలో చెప్పినట్లు వినిపిస్తోంది.

Also Read:నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు..

- Advertisement -