నవంబర్ 14 తర్వాత బీహార్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, విద్య, వైద్యం, ఉపాధి, నీటిపారుదల రంగాల్లో సమగ్ర వ్యవస్థలు, సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ సిటీస్, ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏ బీహారీ కూడా ఇకపై మరో నగరానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నారు.
బీహార్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, NDA పాలన రాష్ట్రాన్ని చివరి స్థానంలోకి నెట్టిందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు ఎన్నికల అధికారులను బెదిరిస్తున్నారని కూడా అన్నారు. ఈసారి బీహార్‌లో మార్పు వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఉపాధి ఇచ్చే ప్రభుత్వాన్ని తెచ్చే దిశగా నిర్ణయించుకున్నారు. ఈసారి బీహార్ ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు అన్నారు.
మొదటి దశ ఎన్నికలు నవంబర్ 6న జరిగాయి, ఇవాళ నవంబర్ 10. నాలుగు రోజులు గడిచినా ఓటింగ్ డేటాను ఇప్పటికీ పబ్లిక్ చేయలేదు. ఇంతకుముందు మాన్యువల్‌గా అదే రోజున డేటా ఇచ్చేవారు. ఇప్పుడు దానిని ఎందుకు దాచిపెడుతున్నారు? రెండవ దశ ఓటింగ్ నవంబర్ 11న, లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. కానీ మీరు నాలుగు రోజుల పాటు కూడా మొత్తం ఓట్ల సంఖ్య తెలియనివ్వరు…ఎన్నికల కమిషన్ చనిపోయింది అన్నారు.
Also Read:తెలంగాణ స్పీకర్‌పై ధిక్కరణ పిటిషన్
గత గురువారం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ శాతం 65.08%గా నమోదైంది — ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం.

