లాలూ వారసుల మధ్య విభేదాలు..?

162
Tej Pratap Yadav

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ కుటుంబంలో తనయుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తమ్ముడు తేజస్వీ యాదవ్‌ పార్టీలో క్రియాశీలకంగా మారుతుండటం; తండ్రి వారసత్వాన్ని ఆయనే అందిపుచ్చుకుంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. లాలూ పెద్దకుమారుడు నితీశ్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే తనను పార్టీలో పక్కన పడేశారని, తొక్కిపడేశారని తేజ్ ప్రతాప్ వాపోతున్నారు.

Tej Pratap Yadav

ఇదే విషయాన్ని ఆయన శనివారం తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో చర్చించారు. బయటి వ్యక్తులు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, పార్టీ కార్యకలాపాల నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ తేజస్వీతో ఆయన అన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పార్టీ ఐక్యతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోబోనని కూడా తేజ్ ప్రతాప్ తెలిపాడు.

అనంతరం ఓ వార్తా సంస్థతో తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ- ‘‘మేమిద్దరం రాజకీయాల్లోనే ఉన్నాం. కానీ, ఆర్జేడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు విచారం కలిగిస్తున్నాయి. కొందరు భ్రష్టులను తేజస్వీ పార్టీలోకి తీసుకున్నాడు. ఇప్పుడు వారు మా ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా… నా తమ్ముడిపై నాకు చాలా ప్రేమ ఉంది’’ అని అన్నారు. అయితే… తాను ఫోన్‌ చేస్తే తన కాల్స్‌ను తేజస్వీ స్వీకరించడంలేదని ఆయన పేర్కొనడం గమనార్హం.