రివ్యూ: తేజ్ ఐ లవ్ యూ

278
Tej i love u review
- Advertisement -

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌-మళయల భామ అనుపమ పరమేశ్వరన్‌ కాంబినేషన్‌లో కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తేజ్ ఐ లవ్‌ యూ. పవన్‌తో తొలిప్రేమ సినిమా తీసి బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న తేజ్‌కు కరుణాకరన్‌ బ్రేక్ ఇచ్చాడా..?తన మార్క్‌ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేశాడా లేదా చూద్దాం…

కథ:

ఓ మహిళ ప్రాణాన్ని కాపాడే క్రమంలో ప్రమాదవశాత్తు నేరం చేస్తాడు తేజ్‌(సాయిధరమ్ తేజ్‌). ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. అయితే తనను కాపాడిన తేజ్‌కు సాయం చేయాలని ఆ మహిళ అనుకుంటుంది..ఇదే విషయాన్ని భర్తకు చెబితే ఒప్పుకోడు. ఆఖరి కోరికగా తన కూతురు నందిని(అనుపమ)కి చెబుతుంది. తల్లి కోరికను తీర్చేందుకు లండన్‌ నుంచి వచ్చిన నందిని ఏం
చేసింది..? నందినికి ప్రమాదం ఎలా జరుగుతుంది..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

Tej I Love U Movie

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ, సాయిధ‌ర‌మ్ తేజ్ , అనుప‌మ,నిర్మాణ విలువ‌లు. తేజ్ పాత్రలో సాయిధరమ్ ఒదిగిపోయాడు. కామెడీ,రొమాంటిక్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. సినిమాకు మరో అట్రాక్షన్ అనుపమ. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తేజ్-అనుపమల కెమిస్ట్రీ తెరపై సూపర్. మిగితా పాత్రల్లో నటించిన అనీష్ కురువిల్లా,జయప్రకాష్,పవిత్ర లోకేష్ ,వైవా హర్ష తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ క‌థ‌, క‌థ‌నం. ప్రేమకథ చిత్రం అంటే ఫ్రెష్ ఫీల్‌ తో పాటు నాచురాలిటీ ఉంటుందని ఆశీస్తారు ప్రేక్షకులు. అందులో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలుంటాయి. అయితే వాటిని అందుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. భావోద్వేగాల్ని పండించడంలో విఫలమయ్యారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. గోపిసుందర్ అందించిన సంగీతం బాగుంది. అందమైన చందమామ పాట బాగుంది.అండ్రూ తన కెమెరా పనితనాన్ని మరోసారి చూపించాడు. కథ,కథనం పరంగా దర్శకుడు కరుణాకరన్ దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కేఎస్ రవికుమార్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for tej i love you

తీర్పు:

ప్రేమకథ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు కరుణాకరన్‌. లవ్‌ మెజీషియన్‌గా ఓ బ్రాండ్ ఇమేజ్ సంపాదించిన కరుణాకరన్‌..మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో చేసిన ప్రయత్నమే తేజ్ ఐ లవ్ యూ. హీరో,హీరోయిన్ల నటన,అక్కడక్కడ కామెడీ సినిమాకు ప్లస్ కాగా కథ,కథనం మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో కాసిన్ని నవ్వులు పూయించే సినిమా తేజ్ ఐల వ్‌ యూ.

విడుదల తేదీ:06/07/18
రేటింగ్:2.5/5
న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌
సంగీతం: గోపీ సుందర్‌
నిర్మాత: కె.ఎస్‌.రామారావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌

- Advertisement -