తెగింపు ఓటీటీలోకి ఎప్పుడంటే…

68
- Advertisement -

తాలా అజిత్ నటించిన తునివు(తెగింపు)…సంక్రాంతి బరిలో తెలుగునాట ఫ్లాప్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన తునివు…వారిసు రాకతో నువ్వా నేనా అన్న పోటీలో భాగంగా తమిళ ఇండస్ట్రీని ముఖ్యంగా ఇద్దరు స్టార్లను సమానంగా ప్రేక్షకులు ఆదరించారు. తమిళనాట తునివు సినిమా విజయ పరంపర కొనసాగింది కానీ చివరి క్షణాల్లో ప్రేక్షకులు వారిసు ఫ్యామిలీ ఎంటర్‌ట్రైనర్‌ కావడంతో తునివు బాగా దెబ్బతింది.

మొదటి వారం అనుకున్న లక్ష్యాలను సాధించిన రెండో వారం నుంచి ఈ సినిమాపై వారిసు పైచేయి సాధించింది. అయితే సంక్రాంతి విన్నర్‌గా తమిళనాడులో బాగా పాపులర్ అయిన తునివు ఎట్టకేలకు ఓటీటీ సంస్థకు త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థైన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఫిబ్రవరి 8నుండి తమిళం తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుంది. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి…

కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు..

లెజెండ్ కె.విశ్వనాథ్ మరణానికి.. కారణం అదే!

శంకరాభరణం విడుదల రోజే.. శివైక్యం

- Advertisement -