ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లలో మునిగి తేలుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొంత మంది సెలబ్రెటీలుగా మారితే మరికొంత మంది మాత్రం ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద బాలిక దారుణ హత్యకు గురైంది. అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది. ఈహత్యకు ఫేస్ బుక్ పరిచయమే కారణమంటున్నారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఫేస్ బుక్ పరిచయం కాస్త వాట్సప్ వరకు వెళ్లింది. వారిద్దరూ రోజు ఛాటింగ్ చేసుకుంటూ చాలా క్లోజ్ అయ్యారు. నవీన్ రెడ్డి కారు మెకానిక్ కావడంతో అమ్మాయిని కవడానికి కారులో మహూబూబ్ నగర్ కి వచ్చాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.. బాలిక ప్రతిఘటించడంతో బండరాయితో కొట్టి చంపేశాడు.
బాలిక ఇంటివద్ద ఉన్న సీసీ టీవీ పుటేజ్ ని పరిశీలించిన పోలీసులు నవీన్ రెడ్డిని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారించగా నిజాలు బయటపెట్టాడు నిందితుడు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి పరామించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తరపు బంధువులు పోలీసులను కోరుతున్నారు.