బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ బై!

121
mallanna
- Advertisement -

బీజేపీకి గుడ్ బై చెప్పారు తీన్మార్ మల్లన్న. ఓ సమావేశంలో మాట్లాడుతూ..ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని..7200 పేరుతో ప్రజాపోరాటం చేస్తానని తెలిపారు. బీజేపీలో చేరడం గత చరిత్ర అన్నారు. బీజేపీ కంటే 7200 లక్ష రేట్లు గొప్పదని చెప్పుకొచ్చారు.

త్వరలో ప్రజల్లోకి వెళ్లి అన్ని వివరిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. తన కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసి ఇస్తానన్నారు. క్యూన్యూస్ ఛానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నానన్నారు. 7200 పేరుతో త్వరలో భారీ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అంబేద్కర్ ఆశయాలను ముందుకు పోతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఉచిత విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటో త్వరలో వెల్లడిస్తామన్నారు.

- Advertisement -