ఏపీలో భారీగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు

4
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ గర్భధారణలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు బెంచ్‌మార్క్ స్థాయి అయిన 5 శాతాన్ని దాటింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అత్యధికంగా 14.94 శాతం నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 13.50 శాతం నమోదైంది. దీనికి విరుద్ధంగా విశాఖపట్నం జిల్లాలో మాత్రమే అత్యల్పంగా 3.98 శాతం నమోదవడం గమనార్హం.

టీనేజ్ వయసులో బాల్యవివాహాలు, లైంగిక దాడులు, అవగాహన లోపం, పాఠశాలల నుండి మధ్యలోనే చదువు మానేయడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా బాలికల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. సరైన లైంగిక విద్యా అవగాహన లేకపోవడం, ఆరోగ్య సేవలకు చేరుకోలేకపోవడం సమస్యను మరింత పెంచుతున్నాయి.

ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ విభాగాలు కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాల్యవివాహాల నియంత్రణపై కఠిన చర్యలు, పాఠశాల స్థాయిలో ఆరోగ్య విద్య, బాలికల సాధికారతపై దృష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:నాగబంధం..బైరాగిగా గరుడ రామ్‌

- Advertisement -