భారత్ 191 ఆలౌట్‌.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్..

147
teamindia
- Advertisement -

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 191 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఠాకూర్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ప్రధాన బ్యాట్స్ మెన్ విఫలమైన చోట ఠాకూర్ ఇంగ్లండ్ బౌలర్లను దూకుడుగా ఎదుర్కొన్నాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4, ఓల్లీ రాబిన్సన్ 3 వికెట్లు తీశారు.అంతకుముందు కెప్టెన్ కోహ్లీ 50 పరుగులు, రోహిత్ శ‌ర్మ 11 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 17 ప‌రుగులు, జ‌డెజా 10, ర‌హ‌నే 14, పంత్ 9, ఉమేశ్ 10 ప‌రుగులు చేశారు.

- Advertisement -