ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలుచుకుంది టీమిండియా. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల టార్గెట్‌ను భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు కొల్పోయి చేధించింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (76) హాఫ్ సెంచరీతో రాణించగా శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (31) , అక్షర్ పటేల్ (29) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వేల్ లు చెరో రెండు వికెట్లు తీయగా, కైల్ జేమీసన్, రచిన్ రవీంద్ర లు తలా ఓ వికెట్ తీశారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), బ్రాస్‌వెల్ (53 నాటౌట్) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు,రవీంద్ర జడేజా, షమీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Also Read:ధోనితో కోహ్లీని పోల్చకండి..!