వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. 121 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండగా విజయానికి 58 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్ (25), సాయి సుదర్శన్ (30)లు ఉన్నారు.
అంతకముందు ఓవర్‌నైట్ 173/2 స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్ 217 పరుగులు జోడించి 390 పరుగులు చేసింది. కాంప్‌బెల్ (115), షై హోప్ (103) సెంచరీలు చేయగా జస్టిన్ గ్రీవ్స్ (50*), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) లు రాణించారు. కుల్దీప్ యాదవ్, బుమ్రా మూడు వికెట్లు తీయగా సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
Also Read:తెలంగాణలో హ్యామ్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్

