రోహిత్ సెంచరీ చేస్తే.. విజయం మనదే!

22
- Advertisement -

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్బుతంగా రాణిస్తోంది. తీవ్ర ఒత్తిడిలోనూ జట్టును ముందుండి నడిపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్ లు ముగియగా అందులో రెండు రోహిత్ సేన గెలిస్తే, ఇంగ్లాండ్ ఒక విజయం అందుకుంది. ఇక ఇటీవల జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ విక్టరి. ఈ మూడో టెస్టు మ్యాచ్ లో హిట్ మ్యాన్ సెంచరీతో రాణించాడు. గత కొన్నాళ్లుగా టెస్టుల్లో విఫలం అవుతూ వచ్చిన రోహిత్ మూడో టెస్టుతో ఫామ్ లోకి వచ్చాడు.

ఇకపోతే రోహిత్ సెంచరీ చేసిన ప్రతి టెస్టు మ్యాచ్ లోనూ టీమిండియా గెలుపు నమోదు చేయడం గమనార్హం. ఇప్పటివరకు టెస్టుల్లో 11 సెంచరీలో చేసిన రోహిత్ శర్మ.. అన్నీ మ్యాచుల్లో కూడా టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. సౌతాఫ్రికాపై 3, ఇంగ్లాండ్ పై 3, వెస్టిండీస్ పై 3, ఆస్ట్రేలియాపై 1, శ్రీలంక పై 1,.. ఇలా రోహిత్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. దీంతో టెస్టు మ్యాచ్ లో హిట్ మ్యాన్ సెంచరీ చేస్తే విజయం పక్కా అని చెబుతున్నారు ఆయన అభిమానులు. ఇక రాంచి వేధికగా ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. నాల్గో టెస్టులో విజయం సాధిస్తే టీమిండియా సిరీస్ కైవసం చేసుకున్నట్లే. మరి ప్రస్తుతం అద్బుత ఫామ్ లో ఉన్న టీమిండియా ఇదే జోష్ ను కొనసాగిస్తుందా ? లేదా ఇంగ్లాండ్ పట్టు బిగిస్తుందా ? అనేది చూడాలి.

Also Read:ఉచిత ఐ క్యాంప్‌లో మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -