యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో భాగంగా 2019 వరల్డ్ కప్ లో ఫైనలిస్ట్ జట్లు అయిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వర్మప్ మ్యాచ్ లలో అదరగొట్టిన ఈ రెండు జట్లు అసలైన సమరానికి సిద్దమయ్యాయి. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కెన్ విలియమ్సన్ తొలి మ్యాచ్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో సారథ్య బాద్యతలను లాథమ్ నిర్వర్తించనున్నాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో కీలక ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ కూడా తొలి మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుంటి నొప్పితో బడపడుతున్న స్టోక్స్ ఆడడం అనుమానమే అని కెప్టెన్ బట్లర్ చెప్పుకొచ్చాడు. .
మరి రెండు పటిష్టమైన జట్ల మద్య జరుగుతున్నా తొలి మ్యాచ్ లో విజయం సాధించి ఏ జట్టు వరల్డ్ కప్ లో భోణి కొడుతుందో చూడాలి. ఇక టీమిండియా విషయానికొస్తే తొలి మ్యాచ్ ను ఈ నెల 8న పాకిస్తాన్ తో తలపడనుంది. కాగా ఈసారి టీమిండియా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతోంది. భారత్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న తొలి వరల్డ్ కప్ ఇదే. గతంలో 1987 లో పాక్ తో, 1996 లో మళ్ళీ పాక్ తోను, 2011 లో బంగ్లా మరియు శ్రీలంక తో కలిసి వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది.
కానీ ఈసారి భారత్ పూర్తి ఆతిథ్యం ఇస్తూ వరల్డ్ కప్ బరిలో దిగుతోంది. 45 రోజుల పాటు జారీగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 న జరగనుంది. ఇప్పటివరకు టీమిండియా ( 1983,2011 ) రెండు సార్లు కప్పు గెలిచింది. 2011 మరియు 2019 వరల్డ్ కప్ లో జట్టులో ధోని కెప్టెన్ గాను ఆటగాడిగాను కొనసాగాడు. కానీ 2023 లో ధోని లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ సారి జట్టులో కోహ్లీ, మరియు రోహిత్ శర్మ ఇద్దరు సీనియర్స్ మాత్రమే.. మిగిలిన ప్లేయర్స్ అంతా కుర్రాళ్లే. మరి ఈసారి టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.
Also Read:Bigg Boss 7 Telugu:శివాజీ – ప్రశాంత్‌లకు 3 స్టార్లు