ప్రాక్టీస్ మొదలుపెట్టనున్న టీమిండియా

285
team india
- Advertisement -

లాక్ డౌన్ 5.0 నేపథ్యంలో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దికాలంగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లు తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో ఇప్పటికే చర్చలు జరిపిన బీసీసీఐ.. ఈ నెల చివర్లో ఐసోలేషన్ క్యాంప్‌ నిర్వహించేలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబరులో ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో రెండు నెలలకు క్రికెట్‌కు దూరమైన ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవసరం. అయితే సాధారణంగా ఏదైనా సిరీస్‌కి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లకి క్యాంప్‌ని నిర్వహిస్తుంటారు.

కానీ ప్రస్తుతం కరోనా కారణంగా ఆపరిస్ధితి కనిపించడంలేదు. ఎందుకంటే కేంద్రం సడలింపులు ఇచ్చినా పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా ప్రయాణ ఆంక్షలు సడలించలేదు. దీంతో ఆటగాళ్లందరూ ఒకేచోట క్యాంపుకు హాజరయ్యే పరిస్ధితి లేదు. దీంతో అందుబాటులో ఉన్న స్టేడియాల్లో జూన్ మూడో వారం నుంచి టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలెట్టబోతున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ వెల్లడించారు.

- Advertisement -