కొండ పోచమ్మ సాగర్‌ను సందర్శించిన మంత్రి తలసాని..

244
Minister Talasani
- Advertisement -

నేడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. మంత్రితో పాటు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది. ఇది ఒక చరిత్ర…అనతికాలంలోనే నిర్మించిన బహుళార్ధక ప్రాజెక్ట్ ఇది అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ రైతాంగం యెక్క పూర్వజన్మ సుకృతం. ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన ఇంజినీరింగ్ అద్భుతాన్ని మంత్రి తలసాని కొనియాడారు.

నియంత్రిత సాగు అంటే పంటలు పండించవద్దని మేము అనడం లేదు, లాభసాటి,డిమాండ్ ఉన్న పంటలు పండించమని చెబుతున్నామన్నారు మంత్రి. కరోన కష్టకాలంలోను సంక్షేమ పథకాలు,ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంలో నేను పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులను ఆదుకోవలనే గొప్ప సంకల్పం కేసీఆర్ ది. ప్రపంచమే కరోన వైరస్‌తో భయబ్రాంతులకు గురవుతున్న సమయంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి తలసాని.

- Advertisement -