కోహ్లీసేనకు జరిమానా…

88
india

ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా ప్లేయర్స్‌కు జరిమానా పడగా ఒక్కో ప్లేయ‌ర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత ప‌డింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ఆర్టిక‌ల్ 2.22 ప్ర‌కారం ఒక టీమ్ త‌క్కువ‌గా వేసే ప్ర‌తి ఓవ‌ర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు

టీమిండియా నిర్ణీత స‌మ‌యంలో ఒక ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించిన‌ట్లు ఐసీసీ ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.తొలి వ‌న్డేలో 66 ప‌రుగుల‌తో ప‌రాజ‌యం పాలైన కోహ్లి సేన అదే వేదిక‌లో ఆదివారం రెండో వ‌న్డే కోసం సిద్ధ‌మవుతోంది.