ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా హవా కొనసాగుతోంది. ఆసియా కప్ గెలిచిన రోహిత్ సేన వరల్డ్ కప్ లోనూ అదే జోరు సాగిస్తోంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. ప్రతి మ్యాచ్ లోనూ భారీ విజయాలు సాధిస్తూ కప్ వేటలో అత్యంత ముందు వరుసలో ఉంది. జట్టులోని అందరూ ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తుండడంతో వరుస విజయాలు టీమిండియా ముంగిట నిలుస్తున్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లో భారత్ సత్తా చాటుతుండడంతో ఈసారి వరల్డ్ కప్ టీమిండియా సొంతం అవుతుందని అభిమానులు ఆశగా ఉన్నారు.
ఇకపోతే టీమిండియా అద్బుతమైన ఫామ్ తో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానంలో ఉన్నారు ఆటగాళ్లు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ బ్యాట్స్ మెన్ జాబితాలో స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ అగ్రస్థానంలో చేరుకున్నారు. నిన్నమొన్నటి వరకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మొదటి స్థానంలో ఉండగా.. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్ తో బాబర్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు శుబ్ మన్ గిల్. ఇక బౌలర్లలో మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అటు అల్ రౌండర్ల జాబితాలో కూడా జడేజా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇలా అన్నీ విభాగాల్లోనూ టీమిండియా ఆదిపత్యం కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు రోహిత్ సేన హాట్ ఫేవరేట్ గా మారింది. ఇక వరల్డ్ కప్ లో భాగంగా తొమ్మిదో ఓవరాల్ మ్యాచ్ అండర్ డాగ్ నెదర్లాండ్ జట్టుతో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ లో అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో ఆటగాళ్లు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Also Read:రెండో గెలుపు నమోదు చేసిన ఇంగ్లాండ్..