వరల్డ్ కప్ లో టీమిండియా చెలరేగిపోతుంది. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ భారీ విజయాలను నమోదు చేస్తోంది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కనీ విని ఎరుగని విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడమే కాకుండా ఆ తరువాత నిప్పులు చెరిగే బౌలింగ్ తో 55 పరుగులకే లంకేయుల నడ్డి విరిచింది. విరాట్ కోహ్లీ ( 88 ), శుబ్ మన్ గిల్ ( 92 ), శ్రేయస్ అయ్యర్ ( 82 ) చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన లంకేయులకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
మ్యాచ్ ప్రారంభం అయిన మొదట్లోనే రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు భారత భౌలర్లు, ఇక వరుసగా మహ్మద్ శమి, సిరాజ్, బుమ్రా.. నిప్పులు చెరిగే బౌలింగ్ తో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ అంతా పెకా మేడల్లా కూలిపోయారు. మహ్మద్ శమి ఐదు వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్, జడేజా ఒక వికెట్ తీసి 55 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో 302 పరుగుల భారీ విజయం టీమిండియా సొంతమైంది. ఈ విజయంతో రోహిత్ సేన అధికారికంగా సెమీస్ లో అడుగు పెట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ లో అడుగు పెట్టడం బహుశా టీమిండియాకు ఇదే తొలిసారి. ఇక ఇదే దూకుడును సెమీస్ లోనూ ఫైనల్ లోనూ కొనసాగించి వరల్డ్ కప్ ను ముద్దాడాలని యావత్ దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ చూస్తుంటే కప్పు గెలిచే అవకాశాలు రోహిత్ సేనకే ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read:TTD:అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు