టీమిండియా యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రాహుల్ లకు ఉరట లభించింది. సుప్రీంకోర్టు నియమిత పాలకమండలి వారిపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేసింది. బాలీవుడ్ ప్రోడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షో లో పాల్గోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో వీరిద్దరి సస్పెండ్ చేసింది బీసీసీఐ. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేసినా.. తాజాగా సీఓఏ తన నిర్ణయాన్ని మార్చుకుంది.ఈ అంశంపై విచారణ జరపడానికి బీసీసీఐ విచారణాధికారిని నియమించే వరకు ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు సీఓఏ స్పష్టం చేసింది.
అమికస్ క్యూరీ పీఎస్ నరసింహతో సంప్రదింపులు జరిపిన తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తేయాలని నిర్ణయించారు. విచారణాధికారిని సుప్రీంకోర్టు నియమించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న దీనిపై కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. సస్పెన్షన్ ఎత్తివేతతో పాండ్యా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.రాహుల్ దేశవాళీ క్రికెట్ లో గానీ, ఇండియా ఎ జట్టులో గానీ ఆడవచ్చునని తెలుస్తోంది.