న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో భారత్ అద్భుత విజయంతో చరిత్ర సృష్టించింది. గువాహటి లోని బర్సాపారా స్టేడియంలో జనవరి 25న జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 పరుగులు సాధించింది. లక్ష్య చేధనలో భారత్ దూకుడు ఆటతీరు ప్రదర్శించింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో అజేయంగా 68 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపుకు తిప్పారు. ఫలితంగా భారత్ 10 ఓవర్లలోనే విజయం సాధించింది.
ఈ విజయంతో టీమ్ ఇండియా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పూర్తి సభ్య దేశంపై 150కు పైగా లక్ష్యాన్ని ఛేదిస్తూ అత్యధిక బంతులు మిగిల్చి గెలిచిన జట్టుగా భారత్ చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 60 బంతులు మిగిల్చి గెలిచింది. గతంలో ఈ రికార్డు 2024లో కింగ్స్‌టన్‌లో వెస్టిండీస్ దక్షిణాఫ్రికాపై 37 బంతులు మిగిల్చి గెలిచిన మ్యాచ్ పేరిట ఉండేది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ఇదే మేం ఆడాలనుకున్న క్రికెట్… 20/3 నుంచి ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు తెలుసు… టాప్ ఆర్డర్ బ్యాటర్లు నా పనిని సులభం చేశారు. బిష్ణోయ్‌కు తన బలాలు బాగా తెలుసు. అతడిని జట్టులో చూడటం సంతోషంగా ఉంది. వరుణ్‌కు మంచి విశ్రాంతి లభించింది అని సూర్యకుమార్ తెలిపారు.
Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు

