- Advertisement -
విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో భారత్ గెలుపు సునాయసమైంది. రెండు ఇన్సింగ్స్‌లలో కలిపి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 421 పరుగులకు డిక్లేర్ చేసి 271 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.అరంగేట్రంలోనే సెంచరీ (387 బంతుల్లో 171 పరుగులు) కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (221 బంతుల్లో 103 పరుగులు) చేయగా యశస్వి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. రెండో టెస్ట్ జులై 20 నుంచి జరుగనుంది.
Also Read:వామ్మో.. జ్వరం ఉన్నప్పుడూ ఇవి తింటే డేంజరే!
- Advertisement -