- Advertisement -
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. వరుసగా మూడో టీ20లోనూ శ్రీలంకను చిత్తుచేసింది. శ్రీలంక విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 16.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
శ్రేయాస్ అయ్యర్ (45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 73 నాటౌట్) హ్యాట్రిక్ హాఫ్‌సెంచరీతో చెలరేగగా శాంసన్ (18),దీపక్ హుడా (21) ,జడేజా (22 నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా శ్రేయాస్ నిలిచాడు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక…నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. గుణతిలక (0),నిస్సాంక (1), అసలంక (4),లియనగె (9),చాందిమల్ (22) చేయగా షనక హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కిది రికార్డు స్థాయిలో వరుసగా 12వ విజయం.
- Advertisement -