సెంచురీయన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా టీమిండియా సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది.
జాన్సెన్(17 బంతుల్లో 54, 4ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ హాఫ్ సెంచరీతో రాణించిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో దక్షిణాఫ్రికా ఓటమి తప్పలేదు. రికెల్టన్ (20),హెండ్రిక్స్ (21),కెప్టెన్ మార్‌క్రమ్ (29), స్టబ్స్(12) ,క్లాసెన్(41)పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌సింగ్(3/37), చక్రవర్తి(2/54) రాణించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ 56 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 పోర్లతో 107 పరుగులతో నాటౌట్‌గా నిలవగా అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. తిలక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Also Read:‘కుబేర’.. ఫస్ట్ గ్లింప్స్