IND vs ENG :అదరహో.. సిరీస్ కైవసం!

13
- Advertisement -

టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ సత్తా చాటింది. నేటితో ముగిసిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించడంతో మరో టెస్టు మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించినప్పటికి ఆ తరువాత జరిగిన రెండు మూడు టెస్టులలో భారత్ గ్రాండ్ విక్టరీలను నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్, మహ్మద్ షమి వంటి కీలక ఆటగాళ్లు ఎవరు లేకపోయినప్పటికి రోహిత్ శర్మ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణించి టీమిండియా కు విజయాన్ని కట్టబెట్టారు. నాలుగో టెస్టు మూడో రోజు మూడో సెషన్ లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (55), గిల్ (52) దృవ్ (39), జైస్వాల్ (37) పరుగులతో రాణించారు. .

ఈ నాలుగో టెస్టులో టీమిండియా నయ సెన్సేషన్ దృవ్ జూరెల్ అద్బుతంగా రాణించాడు మొదట 90 పరుగులు, ఆ తర్వాత 39 పరుగులు చేసి జట్టును కీలక సమయంలో ఆడుకున్నాడు. దాంతో నాలుగో టెస్టుకు గాను ధృవ్ జూరెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 3-1 తేడాతో సిరీస్ టీమిండియా సొంతం కాగా.. వచ్చే నెల 7 నుంచి చివరి టెస్టు మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. ఇక ఈ టెస్టు సిరీస్ విజయంతో స్వదేశంలో 17 టెస్టు సిరీస్ కు సొంతం చేసుకున్న జట్టుగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. 2013 నుంచి 2024 మద్య 17 టెస్టు సిరీస్ లను స్వదేశంలో గెలుచుకొని టీమిండియా అగ్రస్థానంలో ఉంటే.. ఆస్ట్రేలియా (10), వెస్టిండీస్ (8), న్యూజిలాండ్ (8).. సిరీస్ లను వారి స్వదేశంలో గెలిచిన జట్ల జాబితాలో ఉన్నాయి. మొత్తానికి ఇంగ్లాండ్ తో జరిగిన ఈ టెస్టు సిరీస్ లో అదరహో అనిపించిన యువ ఆటగాళ్లపై ప్రశంశలు వెళ్లివిరుస్తున్నాయి.

Also Read:రూ.500 వంటగ్యాస్..వారి పరిస్థితి ఏంటి?

- Advertisement -