ఆసీస్‌పై టిమిండియా ఘన విజయం..

214
- Advertisement -

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఆసీస్ విధించిన భారీ లక్ష్యం 187ను 19.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది భారత్. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (1), రోహిత్‌ శర్మ (17)విఫలమైన కోహ్లీ, సూర్యకుమార్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం చూపించగా కోహ్లీ (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తాచాటాడు. చివర్లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్…నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్‌ కామెరున్‌ గ్రీన్‌ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. సూర్యకుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ , అక్షర్‌ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.

- Advertisement -