భారతీయ సినీ చరిత్రలోని ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన బాహుబలి-2 సినిమా తెలుగు సినిమా స్థాయి ఎటువంటిదో నిరూపించింది. దర్శకుడు యస్ యస్ రాజమౌళి అహోరాత్రులు కష్టపడి.. ఎన్నోఏళ్లుగా ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. ఈ సినిమాకు దాదాపు రూ. 1600 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమ దృష్టి టాలీవుడ్‌పై పడేలా చేసింది. ఈ సినిమా కోసం నటులతో పాటు ఎంతో మంది టెక్నిషియన్లు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు.. వీరిలో రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారి కష్టం కూడా ఈ సినిమాలో ఉందని రాజమౌళి ఎన్నోసార్లు పలు సంధర్బాల్లో తెలిపారు.
వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాజమౌళి భార్య.. రమా రాజమౌళి.. ఆమె అనునిత్యం .. అనుక్షణం స్పాట్లోనే ఉంటూ దగ్గరుండి ఎలాంటి లోపం రాకుండా చూసుకున్నారు. అన్ని పాత్రలను అద్భుతంగా డిజైన్ చేశారు. అందుకు ప్రశాంతి కూడా తనదైన సహాయ సహకారాలను అందించారు. ఈ రోజు వీళ్లిద్దరి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు ఆ సినిమా కోసం ఇద్దరూ పడిన కష్టం తాలూకు మేకింగ్ వీడియోను వదిలారు.
Team Baahubali wishes our stylists Rama Rajamouli and @PrashantiTipirn a very Happy Birthday. https://t.co/zJfUr0BXAB
— Baahubali (@BaahubaliMovie) July 15, 2017