ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి..

243
cm kcr
- Advertisement -

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్ టీయూ – టీఎస్ నాయకులు శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు.

అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్ లైన్ లోనే విద్యాబోధన కొనసాగించాలని,50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని వారు సీఎం కెసిఆర్ కు విన్నవించారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, పీఆర్ టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -