ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు.
పేపర్– 1 అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్– 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి.
టెట్ అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు, రూట్‌మ్యాప్, రవాణా సౌకర్యాలు, ఇతర సందేహాలు, సలహాల కోసం హైదరాబాద్ : 98488 39244 ,రంగారెడ్డి జిల్లా : 96661 62092, 93968 56548, 77999 99242, 99666 53653
,మేడ్చల్ జిల్లా : 91604 19991 ఈ నంబర్లను సంప్రదించవచ్చు.