టీ, కాఫీలలో ఏది బెటర్?

50
- Advertisement -

ప్రతిరోజూ టీ, కాఫీ తాగే అలవాటు చాలమందికి ఉంటుంది. కొందరికి టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవని పరిస్థితి. కొందరైతే ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రోజులో 5-6 సార్లు అయిన టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. అయితే టీ, కాఫీ లు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తాగితే ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. అలాకాకుండా మితిమీరి టీ, కాఫీలు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇదిలా ఉంచితే మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ రెండిట్లో ఏది బెటర్ అనే డౌట్ చాలమందికి వచ్చే ఉంటుంది. ఈ రెండిట్లో ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్ళు కావల్సిన దాన్ని ఇంచుకుంటారు. టీ, మరియు కాఫీ రెండిట్లోనూ కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. ఇకా పోతే టీలో మెదడును స్టీమ్యులేట్ చేసే ఆక్సిడెంట్స్ ఉంటాయి. .

ఫలితంగా టీ తగిన వారిలో తలనొప్పి, ఒత్తిడి వంటివి తగ్గి చురుకుగా ఉంటారు. అలాగే అసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా టీ తాగితే ఆ సమస్యలు తగ్గిపోతాయట. ఇక కాఫీ విషయానికొస్తే టీతో పోలిస్తే కాఫీ కాస్త రుచిగా ఉంటుంది. అంతేకాకుండా కెఫీన్ శాతం కూడా కాస్త అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యే వారికి కాఫీ చాలా ఉపయోగ పడుతుంది. గుండె సమస్యలు, డయబెటిస్ వంటి సమస్యలను తగ్గించే గుణాలు కూడా కాఫీలో ఉన్నాయి. ఉదయన్నే పని భారం ఎక్కువగా ఉన్నవాళ్ళు కాఫీ తాగితే కాస్త రిలాక్స్ గా ఉంటుందని అద్యయానాలు కూడా చెబుతున్నాయి ఇకా టీ, కాఫీలలో చాలా రకాలే ఉన్నాయి. ఎవరు అభిరుచికి తగినట్లుగా వాళ్ళు దాన్ని ఎంచుకుంటారు. అయితే టీ లేదా కాఫీ పరిమాణం ప్రతిరోజూ 400 మిల్లీగ్రాములకు మించరాదని నిపుణులు చెబుతున్నారు. అంటే పెద్ద కప్పులు అయితే ఒకటి లేదా రెండు.., చిన్న కప్పులు అయితే 4 లేదా 5 తాగవచ్చని, అంతకు మించి ఎక్కువ తాగితే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -