తిరుమల అప్‌డేట్..

30
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామి వారిని 71,496 మంది భక్తులు దర్శించుకోగా 26,908 మంది తలనీలాలు సమర్పించారు. హుండి ద్వారా ఆదాయం రూ. 5.33 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇక తిరుమలలో గత రెండు రోజులుగా జరుగుతున్న యువ ధార్మికోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రాఘవేంద్రచార్యులు మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత, దైవభక్తి కలిగి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -